- తానూర్ మండలంలో గణేష్ నిమజ్జన శోభా యాత్రలు వైభవంగా నిర్వహణ
- గ్రామాల్లో విశేష పూజల అనంతరం లడ్డు వేలంపాట, నిమజ్జన ఉత్సవాలు
- పోలీసుల గట్టి బందోబస్తు, ప్రశాంతంగా సాగిన నిమజ్జనం
తానూర్ మండలంలో వినాయక నిమజ్జన శోభా యాత్రలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణేష్ మండలిలు ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డు వేలంపాట నిర్వహించారు. భక్తులు వినాయకుడిని గ్రామాల ప్రధాన వీధుల గుండా ఊరేగించి, సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. పోలీసుల గట్టి బందోబస్తు నిర్వహణతో అవాంఛనీయ సంఘటనలు లేకుండా యాత్ర ప్రశాంతంగా ముగిసింది.
తానూర్ మండలంలోని మసల్గా తండా, కోలూర్ తండా, హిప్నెల్లి, మొగిలి, బోల్సా, ఉమ్రీ(కె), ఝరి(బి), బామ్నీ తండా, ఎల్వత్ వంటి గ్రామాల్లో గణేష్ నిమజ్జన శోభా యాత్రలు శుక్రవారం వైభవంగా నిర్వహించాయి. 7 రోజులపాటు శాస్త్రోక్త పూజలు నిర్వహించిన గణనాథుడి విగ్రహాలు ఈ శోభా యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాత్రలో వినాయకుడిని ట్రాక్టర్ ట్రాలీలపై ఉంచి, గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. సౌండ్ బాక్స్, పాటలపై యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యాలు చేయడంతో యాత్ర మరింత అందంగా సాగింది.
వినాయకుని నిమజ్జనం సమీప చెరువుల్లో, వాగుల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లడ్డు వేలంపాట, పాటలతో నిమజ్జనం ఉత్సవం ప్రత్యేకంగా నిలిచింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సీఐ మల్లేష్, తానూర్ ఎస్సై లోకం సందీప్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజి సర్పంచులు, ఆలయ కమిటీలు, వీడీసీ కమీటీల సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.