మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు
అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 26
డిసిసి అధ్యక్షునితోపాటు పలు పదవులు చేపట్టిన మాశెట్టి వార్
దివంగత మాజీ మంత్రి గడ్డెన్న తో విడదీయారని బంధం
తల్లి పేరిట సరస్వతీ శిశు మందిర్ సుభద్ర వాటిక స్థలం ఇచ్చింది ఆయనే
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మా శెట్టి వార్ నిన్న రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. 1981 నుండి 1992 వరకు 10 సంవత్సరాల పాటు భైంసా మాజీ మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు అయన.. దివంగత మాజీ మంత్రి గడ్డెన్నకు అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షునిగా కొనసాగారు. గడ్డెన్న ఎమ్మెల్యే గా ఉన్నంత సేపు దిగంబర్ మాశెట్టివార్ జిన్నింగ్ ఇండస్ట్రీ యే అయన కార్యాలయం.. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ సనాతన ధర్మం కోసం ఎంతో పని చేసారు. సరస్వతి శిశుమందిరాల అభివృద్ధి కి పాటు పడ్డారు.. తన తల్లి పేరిట కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని సరస్వతి శిశుమందిర్ సుభద్ర వాటికకు ఇచ్చిన మహోన్నత వ్యక్తి.. చెరువు కట్ట శివాలయం తో పాటు భైంసా లో పలు ఆలయాల అభివృద్ధి కి పాటు పడ్డారు.. అందరితో కలివిడిగా ఉంటూ భైంసా కు పెద్దన్న లా కొనసాగారు..