మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్?*

*మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్?*

*మనోరంజని ప్రతినిధి*

హైదరాబాద్:ఫిబ్రవరి 13
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లోరాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్‌ చేశారు

అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ.. అయితే, ఈ కేసుపై బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు వంశీ.. కానీ, తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ.. ఏపీ పోలీ సులతో వల్లభనేని వంశీ తీవ్ర వాగ్వాదానికి దిగారు.

దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు.. పార్టీ కార్యాల యంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.. ఇక, ఈ కేసులో ఈ నెల 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది..

మరోవైపు.. హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసు కు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చినట్టు అయ్యిం ది.. మరోవైపు.. మట్టి తవ్వకాలకు సంబంధించి.. మరో కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదు అయిన ట్టుగా సమాచారం.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..

ఇక, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై కోర్టులో కేసుని వెనక్కి తీసుకున్న సత్య వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్లు సమాచారం.. కోర్టులో పిటిషన్ సత్య వర్ధన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దానిపైన పోలీసులు విచారణ చేపడితే..

వంశీతో పాటు అనతి అనుచరులు సత్య వర్ధన్ బెదిరించడంతో అతను కేసును వెనక్కి తీసుకున్న ట్లుగా పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే పోలీసులు వల్లభనేని వంశీ మోహన్‌తో పాటు..

అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలోనే పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి.. విజయవాడ తరలిస్తున్నట్టుగా సమాచారం..

Join WhatsApp

Join Now

Leave a Comment