షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ తదితరులపై కేసు నమోదు
అంజయ్యతో పాటు మరో 18 మంది పేర్లు గుర్తింపు
ఆందోళన చేపట్టిన నాయకులందరిపై కేసు నమోదు
షాద్ నగర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ మరో పద్దెనిమిది మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా పట్టణ చౌరస్తాలో ఆందోళన నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కల్పించడం, తదితర అంశాలను పల్లెల్లోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరింది. ఈ అంశంపై షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పట్టణ ముఖ్య కూడలిలో బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పోలీసులు నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇందులో భాగంగానే ధర్నా కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం, ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలకు నానా ఇబ్బందులు కలిగించారనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటుగా మరో 18 మందిని గుర్తించి వారి పేరు నమోదు చేశారు. ఇంకా ఈ ఆందోళనలో పాల్గొన్న వారిపై కూడా కేసు నమోదు అయిందని కేసు విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు