ముధోల్‌లో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
మనోరంజని తెలుగు టైమ్స్ – ముధోల్, డిసెంబర్ 01
ముధోల్ మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ (రమేష్) ఇంటిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని గృహ సామగ్రి మొత్తం దగ్ధమైన ఘటనపై ಮಾಜಿ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సోమవారం బాధితులను పరామర్శించారు. కాలి బూడిదైన ఇంటిని స్వయంగా పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, జరిగిన నష్టంపై కుటుంబ సభ్యుల ఆవేదనను తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు, అలాగే నగదు మొత్తం అగ్నికి ఆహుతైన విషయాన్ని బాధితులు వివరిస్తూ తమ బాధను వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం అయిన కారణంగా ఈ భారీ నష్టాన్ని భరించలేకపోతున్నామని విన్నవించారు. బాధిత కుటుంబానికి తాను అండగా నిలుస్తానని నారాయణరావు పటేల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ యువ నాయకుడు, అష్టాకు చెందిన రావుల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా బాధితుల పక్కనే ఉంటారని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే, నాయకులు పల్లోల నాగేష్, అజీజ్, దిగంబర్, కిషన్ పటేల్, కిషన్ పతంగే, మాజీ ఉపసర్పంచ్ గడ్డం సుభాష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.