ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్, అక్టోబర్ 28, 2024
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సయ్యద్రి అడవుల్లో చిరుతపులి సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులుగా శువులు మరియు మేకలపై చిరుతపులి, పెద్దపులి దాడులు చేస్తున్నట్లు స్థానికంగా సమాచారం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, స్థానిక ప్రజల మధ్య ఆందోళన ఏర్పడడంతో, నిజానిజాలను తెలుసుకునేందుకు సోమవారం అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న పగ్ మార్క్‌ను పరిశీలించినప్పుడు, అది పెద్దపులి ఆనవాలుగా గుర్తించారు.
అలాగే, ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతపులి సంచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడవికి దగ్గర్లో ఉన్న తండా వాసులకు, అడవి లోపలికి పశువులను మేపడానికి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో IFS CHIEF CONSERVATOR OF FOREST శరవనన్, శ్రీమతి షేక్ ఆదం నాగిని భాను (DFO), రామ కృష్ణ (FRO నిర్మల్), వేణు గోపాల్ (FRO టాస్క్ ఫోర్స్), MD నజీర్ ఖాన్ (DYRO), సంతోష్ (DyRO) తదితరులు పాల్గొన్నారు.