ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా – అక్టోబర్ 13
సారంగాపూర్:
ప్రమాదవశాత్తు తాను నడుపుతున్న ట్రాక్టర్ కింద పడి రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన రైతు దేశెట్టి రమేష్(42) తన చేనులో తన ట్రాక్టర్ తో రోటోవేటర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు.
మృతుని భార్య శ్రీలత పిర్యాదు మేరకు కేసునమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు