హైదరాబాద్: అక్టోబర్ 24
వీఆర్వో వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.
రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో వీఆర్వో వ్యవస్థను ధ్వంసం చేసారని, అందుకే వీఆర్‌వో వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
మళ్లీ వారిని వీధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్ పేరును కూడా మార్చనున్నట్లు ముఖ్య ప్రకటన చేశారు.
ధరణి పేరుతో ఇష్టానుసారం దోచుకున్నవారిని తప్పకుండా జైలుకు పంపుతామని మంత్రి స్పష్టం చేశారు.