ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు మిట్టపల్లి వెంకటేష్ మరియు విద్యుత్ శాఖ అధికారులు శాంతినగర్లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస చారి, ఏఈ టౌన్-2 రవీందర్ రెడ్డి, మారం శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు.
వెంటనే మిట్టపల్లి వెంకటేష్ మాట్లాడుతూ, "నేడు మనం నాటే మొక్కలు రేపటి తరానికి ఆక్సిజన్ బహుమతి" అని చెప్పారు. "ప్రతి ఇంటికి ఒక చెట్టు, ప్రతి గుండెకు స్వచ్ఛమైన ఊపిరి" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, మహిళలు, మున్సిపాలిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు మొక్కలు నాటిన అనంతరం, మున్సిపాలిటీ సిబ్బంది వాటికి నీళ్లు పోసి సంరక్షించే బాధ్యత తీసుకున్నారు.








