మిర్యాలగూడ, 2023-07-01
కేంద్ర ప్రభుత్వ 'జల్ సంజయ్ జన్ భాగిదారి' పథకం అమలులో భాగంగా మిర్యాలగూడ మండలంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జప్తి వీరప్పగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు.
పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భూగర్భజలాలు ఒడిసి పట్టుకుందాం..!
కేంద్ర ప్రభుత్వ పథకం 'జల్ సంజయ్ జన్ భాగిదారి' (నీటిని పొదుపు చేద్దాం, పొదుపు చేయడంలో భాగస్వామ్యాన్ని పాటిద్దాం) లో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మిర్యాలగూడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం జప్తి వీరప్పగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బిక్షపతి అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి శేషగిరి శర్మ, సర్పంచ్ అందుగుల వెంకటయ్యలు మాట్లాడుతూ నీటిని పొదుపు చేసుకోవడం, భూగర్భ జలాలను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ నరసింహ చారి, ఈసీ కళావతి, ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య యాదవ్, దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ పేలపోలు శ్రీనివాస్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆస్మా, టెక్నికల్ అసిస్టెంట్ రేణుక, గ్రామ పెద్దలు లతీఫ్, సత్యనారాయణ, జగదీశ్వర్ రెడ్డి, మాధవి, శ్రీనివాస్ రెడ్డి, జల్ రామ్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.












