నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అధికారులు, అతిథులు కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వృక్షాలు మానవ జీవనానికి ఆధారం అని, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఉప అటవీ క్షేత్రాధికారి శ్రీ మహమ్మద్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడెల్లి సర్పంచ్, బీట్ అధికారులు, గ్రామ ప్రజలు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












