కుంటాల, జూలై 10
వన మహోత్సవాన్ని పురస్కరించుకుని కుంటాల పోలీస్ స్టేషన్లో ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
వన మహోత్సవాన్ని పురస్కరించుకుని కుంటాల పోలీస్ స్టేషన్లో ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ, "చెట్లు ప్రగతికి మెట్లు" అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుంటాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, మోడల్ స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు.












