కడం (పెద్దూర్), 2026-07-18
కొండకూుగమపంచయీోుసిగకుకపోడంోఏపడుుీటిసమసయపపయకగమసభుిహించుసపంచశీభీమఅధయక,ిమజిఉపసపంచఅధయకుడుశీపొదదుటూుసంపెడడిఆధయంోజిగిఈసమశంోపుుుఅధికుు,గమడుసభయుుపగొు
కొండకూరు గ్రామపంచాయతీలో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఏర్పడుతున్న నీటి సమస్యలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ శ్రీ భీమేష్ గారు అధ్యక్షత వహించగా, నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్ అధ్యక్షుడు శ్రీ పొద్దుటూరు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో కడం MPDO అరుణ మేడం, MPO శ్రీనివాస్, AEO నవీన్, సెక్రటరీ అరుణ మేడం, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామసభలో చర్చించారు.
ప్రభుత్వ పథకాల ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 'నీటిని ఆదా చేద్దాం - భవిష్యత్తును కాపాడుదాం' అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.












