మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
మెండోరా మండలంలోని దూదగాం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ హరోను రషీద్ బాబా ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించారు.
వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మెండోరా మండలంలోని దూదగాం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ హరోను రషీద్ బాబా ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కను నాటడం మాత్రమే కాకుండా అది మహావృక్షంగా ఎదిగే వరకు ప్రతిరోజూ నీరు పోసి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాజశేఖర్, విలేజ్ రెవెన్యూ అధికారి భూమేశ్వర్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు కపిల్, అక్తర్ షరీఫ్, ఏసన్న, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, అలీమ్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












