బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
బైంసా పట్టణంలో మొక్కల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటుతూ కౌన్సిలర్లు అమూల్, చింతపండు మహేష్‌లు ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు.
మొక్కల పరిరక్షణతోనే మానవజాతి జీవన మనుగడ సాధ్యమని బైంసా పట్టణంలోని నాలుగవ, ఆరవ వార్డు కౌన్సిలర్లు అమూల్, చింతపండు మహేష్‌లు అన్నారు. ఆదివారం రోజున పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద, అదేవిధంగా గోపాల్ నగర్ లోని హనుమాన్ ఆలయ ఆవరణలో ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లను కాలనీవాసులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజు పటేల్, డాక్టర్ సాగర్, శంకర్, చంద్ర, సతీష్, వెంకటేష్, డాక్టర్ మోహన్, రవీంద్ర చారి, అశోక్ చారి, కృష్ణమూర్తి, దశరథ్, అవధూత్ పటేల్, వినాయక పటేల్, గణేష్ లతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.












