రాజన్న సిరిసిల్ల, జూలై 6
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాక్సూట్లు, షూలు, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. అలాగే, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాక్సూట్లు, షూలు, క్రీడా సామగ్రిని పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు.
అనంతరం అతిథులు పాఠశాల ఆవరణలో పండ్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ ప్రారంభించారు.
కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలుగం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, నర్సింగాపూర్ ప్యాక్స్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, డాక్టర్ ఆడెపు జయరాం, డాక్టర్ సత్యనారాయణ, మారం స్వదేశ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ, వార్డు సభ్యులు, దమ్మ వెంకటరమణ, జోగు శంకర్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











