SPSR Nellore/Jaladanki (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
విద్యార్థులను వ్యవసాయ పనులకు, ఇతర పనులకు తీసుకెళ్లకుండా ప్రతిరోజూ పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులకు ఉందని ఖానాపూర్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధా రాథోడ్ అన్నారు. శనివారం మండలంలోని పాత ఎల్లాపూర్ ఉన్నత పాఠశాల, సత్తనపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల చదువే వారి జీవితానికి పునాది అని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.
విద్యార్థులను వ్యవసాయ పనులకు, ఇతర పనులకు తీసుకెళ్లకుండా ప్రతిరోజూ పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులకు ఉందని ఖానాపూర్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధా రాథోడ్ అన్నారు. శనివారం మండలంలోని పాత ఎల్లాపూర్ ఉన్నత పాఠశాల, సత్తనపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.
బడి ఈడు పిల్లలు పనుల్లోకి వెళ్లకుండా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని అన్నారు. విద్యార్థుల చదువే వారి జీవితానికి పునాది అని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, రాగి జావ, షూలు, టై వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని కోరారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జాడ భీమలింగం మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాల సమయానికి పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఉదయం ప్రార్థన అనంతరం ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేస్తామని, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు హాజరు నమోదు కాకపోవడంతో పాఠశాల హాజరు శాతం తగ్గుతుందని వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సకాలంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, భీమలింగం, శ్యామ్ కృష్ణ ప్రసాద్, సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.












