నిర్మల్, జూలై 18
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని PDSU నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగరి వెంకటేష్ డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని PDSU నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగరి వెంకటేష్ డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోను చేపట్టిన దీక్షకు PDSU నిర్మల్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. NEET పరీక్ష నిర్వహణలో జరిగిన గందరగోళం, అక్రమాలు, పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు.
NEET పరీక్షలో జరిగిన అక్రమాలపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి PDSU అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు నవీన్, రాహుల్, సురేష్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

