రామడుగు, 23 July
దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, వరుస ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని జాతీయ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, విద్యా వ్యవస్థ పరిరక్షణకు జూలై 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చింది.
దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, వరుస ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని జాతీయ విద్యార్థి సంఘం రామడుగు మండల అధ్యక్షుడు జవ్వాజి అజమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుతో ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వారా చెలగాటమాడడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు, ప్రశ్నించిన విద్యార్థులపై ఢిల్లీలో లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
విద్యారంగానికి తగిన ప్రాధాన్యం, నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
విద్యార్థుల హక్కులను పరిరక్షించడం, విద్యా వ్యవస్థను కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం కోసం వివిధ విద్యార్థి సంఘాల సంయుక్త పిలుపు మేరకు జూలై 24న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్కు మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని జవ్వాజి అజమ్ విజ్ఞప్తి చేశారు.












