రంగారెడ్డి, జూలై 23
జూలై 24న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్ పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
జూలై 24న ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్ కోరారు.
ఈ మేరకు షాబాద్ మండలంలోని విద్యాసంస్థల్లో నాయకులు బంద్ నోటీసులు పంపిణీ చేశారు. బంద్‌కు ప్రజలు, విద్యార్థులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్, ఇబ్రహీం, పాషా, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము యాదవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.












