నిర్మల్, జూలై 30, 2026
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు (గురువారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేడు (గురువారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.












