సారంగాపూర్, జులై 23
ఢిల్లీలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు మద్దతుగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండించారు. ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు మద్దతుగా నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు ఖండించారు.
బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, ఇలాంటి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి వెంటనే పి.ఎం. మోడీ, విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, అబ్ధుల్ హాది, దశరథ రాజేశ్వర్, భోల్లోజి నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, విలాస్ రావు, భూమారెడ్డి, మధుకర్, లక్ష్మణ్, సురేందర్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.












