మిర్యాలగూడ, 2026-08-20
మిర్యాలగూడ పట్టణలోి శివాి టెక్ో స్కూల్ లో మాజీ ప్రధామత్రి, భారత రత్ స్వర్గీయ రాజీవ్ గాధీ 82వ జయతి వేడుకలుడుకలు గా ిర్వహిచారు. ఈ వేడుకలుడుకలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మిర్యాలగూడ పట్టణంలోని శివాని టెక్నో స్కూల్ లో గురువారం మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించి, అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆధునిక అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
సాంకేతికతకు ప్రాధాన్యత
ముఖ్యంగా విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశంలో కంప్యూటర్, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు నేటి విద్యార్థులు, యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
పాఠశాల యాజమాన్యం
అందుకే విద్యార్థులతో కలిసి ఆయన జయంతి వేడుకలను నిర్వహించేందుకు శివాని టెక్నో స్కూల్కు విచ్చేశానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాని విద్యాసంస్థల చైర్మన్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












