కొత్తగూడెం, 2026-08-29
కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ లో బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులు గాజుల రామ మూర్తి, షాజహాన్ పర్వీన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు చేశారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ జెడ్పీ హైస్కూల్ లో బాల్య వివాహాలు మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందిన నల్సా ఆశ న్యాయ సహాయ యూనిట్ ప్యానల్ న్యాయవాదులు గాజుల రామ మూర్తి, షాజహాన్ పర్వీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన
గాజుల రామ మూర్తి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల వల్ల విద్యకు దూరమవడంతో పాటు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు
షాజహాన్ పర్వీన్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, విద్యార్థుల ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావాన్ని వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు.
న్యాయ సేవలు, హక్కులపై వివరణ
విద్యార్థులు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలు, న్యాయ సహాయ సేవల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని న్యాయవాదులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మెండు రాజమల్లు, పెసరమిల్లి నాగేశ్వర రావు, పారా లీగల్ వాలంటీర్ షానాజ్ బేగం, స్కూల్ హెడ్మాస్టర్ లాలు, టీచర్ దేవీలాల్ తో పాటు విద్యార్థినిలు పాల్గొన్నారు.












