దస్తురాబాద్, జూలై 24
కడెం దస్తురాబాద్ ప్రైవేట్ పాఠశాలల TRASMA (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కడం లోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.
కడెం దస్తురాబాద్ ప్రైవేట్ పాఠశాలల TRASMA సమావేశం కడం లోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షులు: పెరక గంగాధర్ (ఆర్య స్కూల్, మున్యాల్) ఉపాధ్యక్షులు: కత్తి రాజశేఖర్ (వే ఆఫ్ ఫ్యూచర్ స్కూల్, మద్ధిపడగ) ప్రధాన కార్యదర్శి: కేరళ వినీత (కేరళ స్కూల్, దస్తురాబాద్) కోశాధికారి: వినీత్ (కేరళ స్కూల్, కడం).












