జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ఫీజులలో రాయితీ కల్పించాలని నిరసన ధర్నా :
మిర్యాలగూడ జులై 6 (మనోరంజని తెలుగు టైమ్స్)
టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్లగొండ జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలిమెల నాగయ్య,టీయూడబ్ల్యూజే జిల్లా ప్రచార కార్యదర్శి ఎండిఅస్లాంలఆధ్వర్యంలోమిర్యాలగూడ టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ డీ ఏఓ శ్రీనివాస శర్మ, మండల విద్యాధికారి ధర్మానాయక్ లకు వినతి పత్రాలు సమర్పించారు.
జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు పాఠశాలలలో ఫీజు రాయితీ కల్పించాలని కోరారు.
ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేసేంతవరకు ఉద్యమాలుచేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమిర్యాలగూడ డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు
బాలాజీ రావు, ప్రధాన కార్యదర్శిరమేష్.సీనియర్ జర్నలిస్టులో నామిరెడ్డి నరేందర్ రెడ్డి, ఖాజా నాజీముద్దిన్, సుమన్, కిషోర్ జిల్లా ప్రచార కార్యదర్శి కాతోజు నాగ చారి,,బండ వేణుగోపాల్ రెడ్డి, అశోక్, రాచకొండ రమేష్, సునీల్ చౌదరి, కిషోర్, శీను, కాట్రాజ్ అశోక్, నక్క శ్రీను, వెంకన్న, హరీష్ బాబు, తోఫిక్, కట్ట బాబు, షేక్ వసీం, రాయించు నగేష్
తో పాటు పలువురు జర్నలిస్టులుపాల్గొన్నారు.











