Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌ల తయారీని వెంటనే పూర్తి చేసి, పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక అంశాలపై సమీక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల తయారీని వెంటనే పూర్తి చేసి, సిద్ధమైన వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్కూల్ యూనిఫామ్‌ల తయారీ, వర్ష పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల సంరక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా యూనిఫామ్‌ల తయారీ పురోగతిని పరిశీలించిన సీఎస్, తయారీ పూర్తైన వెంటనే విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణ పరిస్థితులపై సమీక్షిస్తూ, జలసిరి కార్యక్రమం కింద భూగర్భ జలాల సంరక్షణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాల పరిరక్షణపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రతి మండలంలో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున ఫామ్పాండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనిఫామ్‌ల తయారీని వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఈవో భోజన్న, డీఎంహెచ్ఓ రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, సీపీవో గంగారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖ ఈఈలు సందీప్, అనిల్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.












