బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్నలకు హైదరాబాద్ లో వినతిపత్రం అందించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని బోథ్ మండల బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్నలను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
బోథ్ మండలంలో అనేక గ్రామాల్లో నిరుపేద విద్యార్థులు ఉన్నారని, వారందరికీ నాణ్యమైన విద్య అందించాలంటే బోథ్ మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బోథ్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, అడ్వకేట్ పoద్రం శంకర్, సర్పంచులు రాజు రెడ్డి, రూప్‌చంద్, రాజేందర్, ఉయికె కిట్టు, సీనియర్ నాయకులు సిరిసే సంజీవ్, ఇఫ్తేకర్, రమణ రెడ్డి, గంగమల్లు, ఏనుగంటి రవి, రాము, కార్యకర్తలు పాల్గొన్నారు.












