☝️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
NEET పేపర్ లీక్‌కు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై కేంద్ర మంత్రి వేద ప్రకాష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నలుగురైదుగురిని పట్టుకుని ఉరితీస్తే మిగతావారు భయపడతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని పలువురు విమర్శిస్తున్నారు.
NEET పేపర్ లీక్‌పై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నలుగురైదుగురిని పట్టుకుని మెడకు తాడు కట్టి ఊరి వేసి చంపితే మా (బీజేపీ) బలం ఏంటో వాళ్లకు తెలుస్తుంది. వారిని ఊరి వేసి వేలాడదీస్తే మిగతా వాళ్లు భయపడతారు' అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వేద ప్రకాష్ గోయల్. ఆయన ప్రస్తుతం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో బీజేపీ జాతీయ కోశాధికారిగా కూడా పనిచేశారు.
2014 నుంచి బీజేపీ మోడీ ప్రభుత్వంలో రైల్వే, బొగ్గు, విద్యుత్, పునరుత్పాద ఇంధన, టెక్స్టైల్స్, వినియోగదారుల వ్యవహారాల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర ముంబై నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు.
ప్రజాస్వామిక విలువలను పరిరక్షించే సరైన ప్రజా ప్రతినిధులు ఇలాగే ఉంటారని ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.












