- వరద బాధితులకు మంత్రి నారా లోకేష్ కు విరాళాలు అందజేయడం
- గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు
- కృతజ్ఞతలు తెలుపిన మంత్రి
వరద బాధితులకు సహాయం అందించేందుకు మంత్రి నారా లోకేష్ ను కలిసిన వారు రూ. 14,26,821 విరాళాలు అందజేశారు.
09-10-2024, విజయవాడ:
వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి, పాఠశాలలు మరియు సంస్థల నిర్వాహకులు విరాళాలు అందించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, మొత్తం రూ. 14,26,821 సేకరించారు.
ఈ సందర్భంగా కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.