మంచిర్యాల : *లంచం తీసుకుంటూ జిల్లా అధికారి ఏసీబీ వలలో*

మంచిర్యాల : *లంచం తీసుకుంటూ జిల్లా అధికారి ఏసీబీ వలలో*

మంచిర్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఓ జిల్లా అధికారిని లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ తన నివాసం — మంచిర్యాల కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో రెండు లక్షల రూపాయలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం చేతికి చిక్కారు.

సస్పెండ్ అయిన ఉద్యోగికి పెరిగిన వేతనాలు మంజూరు చేసే క్రమంలో మొత్తం ₹7 లక్షలు లంచం డిమాండ్ చేసిన బిక్కు నాయక్, తొలి విడతగా ₹2 లక్షలు తీసుకునే సమయంలో వలపన్ని పట్టుబడ్డారు.

బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు ఆయనను రంగే హస్తంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మంచిర్యాల కలెక్టరేట్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment