బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
మండలంలోని దేగాం గ్రామంలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదేవార్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందారు.
దేగాంలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న విలాస్ గాదేవార్ మండలం, సెప్టెంబరు 3 ( మండలంలోని దేగాం గ్రామంలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదేవార్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న విలాస్ గాదేవార్కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా సన్నిధిలో పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మ సురేష్, సుంకేట పోశెట్టి, రాహుల్ పోశెట్టి, కపిల్, సజన్, మైపాల్, అమిర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి కొంతసేపు గడిపిన నాయకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.












