వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 03
వేల్పూర్ కు చెందిన శ్రీ గోవింద గిరి దివ్య యోగాశ్రమము వ్యవస్థాపకులు, కుండలిని జ్ఞానయోగి, అవధూత బ్రహ్మ అయిన శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి శిష్యులు ఆషాడమాసం సోమవారం రోజున వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ శివారులో గల శ్రీ సంత మల్లన్న స్వామి (గుట్ట) దేవాలయం ప్రాంగణంలో వనభోజనాలకు తరలి వెళ్లారు. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో వారు స్వయంగా వంటలు చేసుకున్నారు.

ప్రత్యేక పూజలు, భజనలు
తదనంతరం శ్రీ సంత మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. గంటల తరబడి నిరవధికంగా భజనలు చేయడంతో ఆలయ ప్రాంగణమంతా హరినామ సంకీర్తనలతో మార్మోగింది. నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివా, కరిముఖ గణరాయా, శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా అంటూ శివునిపై బ్రహ్మాండమైన భజన పాటల్ని ఆలపించారు.
సహపంక్తి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు
పంచామృతాహారాలతో వండిన భోజనాలను సహపంక్తిగా ఆరగించారు. రోజంతా ఆడుతూ పాడుతూ ఆనంద పరవశులయ్యారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఐకమత్యానికి వనభోజనాలు
ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, పెద్దలు సాంప్రదాయంగా పెట్టిన వనభోజనాలు ఐకమత్యానికి చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. శిష్యులంతా ఐక్యంగా ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది రాణించాలని ఆకాంక్షించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గోవింద గిరి స్వామి శిష్యులు, భజన కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.