Lakshadweep, 2026-06-05
కురువ గొల్లల ఇష్టదైవం బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణాలను కూల్చివేస్తే సహించబోమని, ఇలాంటి పనులు చేపడితే వారిని, వారి వ్యాపారాలను సైతం తాము కూల్చుతామని షాద్ నగర్ బీజేపీ నేత అందే బాబయ్య హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక సీఎస్కే విల్లాస్ వెంచర్లో కొందరు బీరప్ప దేవాలయ నిర్మాణాలకు సంబంధించిన పిల్లర్లు, స్టీల్ ధ్వంసం చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కురువ గొల్లల ఇష్టదైవం బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణాలను కూల్చివేస్తే సహించబోమని, ఇలాంటి పనులు చేపడితే వారిని, వారి వ్యాపారాలను సైతం తాము కూల్చుతామని షాద్ నగర్ బీజేపీ నేత అందే బాబయ్య హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక సీఎస్కే విల్లాస్ వెంచర్లో కొందరు బీరప్ప దేవాలయ నిర్మాణాలకు సంబంధించిన పిల్లర్లు, స్టీల్ ధ్వంసం చేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కురువ గొల్లలతోపాటు గ్రామ పెద్దలతో ఆయన, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ కలిసి హాజరయ్యారు. వాస్తవాలు వారితో అడిగి తెలుసుకున్నారు.
క్షమించరాని నేరం
తనకు 67 ఏళ్ల వయసుందని, తన తండ్రులు, తాతలు పుట్టకముందే ఇక్కడ బీరప్ప దేవాలయం ఉండేదని, ఇది ఒకప్పటి వల్లభాపురం ప్రాంతమని అందే బాబయ్య అన్నారు. ఈ సంఘటన క్షమించరాని నేరమని ఆయన అభివర్ణించారు. సీఎస్కే ప్రాంతంలో అక్రమాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని, ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ దేవాలయాల జోలికి వస్తే వారి వ్యాపారాలను, వారిని కూల్చివేస్తామని సీఎస్కే యాజమాన్యాన్ని అందే బాబయ్య హెచ్చరించారు.
భూమి ఆక్రమణ ఆరోపణలు
బీరప్ప దేవాలయానికి సంబంధించిన 10 గుంటల స్థలాన్ని స్థానికులకు అప్పజెప్పకుండా, మాయమాటలు చెప్పి నమ్మించి, ఎవరికీ తెలియకుండా అక్రమ పద్ధతుల ద్వారా ఇతరులకు ఇళ్ల స్థలాలు విక్రయించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ దేవాలయ భూమిని ప్లాటుగా చేసి విక్రయించిన సంఘటనలో సీఎస్కే యాజమాన్యం వెంటనే స్పందించి, అమ్మిన వారికి వేరే చోట ప్లాట్లు చూపించాలని, ఈ భూమి జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అదేవిధంగా కొంతమంది రైతులు భూమి విక్రయించకపోయినా వారి స్థలాలను లే అవుట్లుగా చూపించడం అత్యంత దారుణమని అన్నారు.
ఫిర్యాదు చేస్తామన్న బాబయ్య
ఈ అక్రమాలపై హెచ్ఎండిఏతో పాటు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కూడా తాను ఫిర్యాదు చేస్తానని, అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. దేవాలయ స్థలంలో పిల్లర్లను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని బాబయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి సంఘటన స్థలంలో పరిశీలనలు జరిపారు. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి పూర్తిస్థాయిలో అందరూ సహకరించేలా చర్యలు తీసుకోవాలని అంజయ్యను కూడా బాబయ్య కోరారు.











