నిర్మల్, జులై 5
ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో రామేశ్వరం యాత్ర కోసం ప్రత్యేక బస్సును ఈ రోజు ప్రారంభించారు. ఈ బస్సు నిర్మల్ నుంచి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళషెంబు, మదురై మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కంచిపురం, శ్రీకాళహస్తి గుండా నిర్మల్ కు చేరుకుంటుంది.
ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో రామేశ్వరం యాత్ర కోసం ప్రత్యేక బస్సును ఈ రోజు ప్రారంభించినట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళషెంబు, మదురై మీదుగా రామేశ్వరం చేరుకుంటుందని ఆయన వివరించారు. తిరుగు ప్రయాణంలో కంచిపురం, శ్రీకాళహస్తి గుండా నిర్మల్ చేరుకుంటుందని తెలిపారు.
ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నందున అనేక యాత్ర సర్వీసులను ప్రారంభించామని, భవిష్యత్తులో ప్రయాణికుల కోరిక మేరకు సోమనాథ్, ద్వారక వంటి పుణ్యక్షేత్రాలకు కూడా బస్సులు నడుపుతామని పండరి పేర్కొన్నారు.
గతంలో కాశీ, అయోధ్య, నైమిశారణ్య, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, పూరి జగన్నాథ్, కోణార్క్, అన్నవరం, అర్సవెల్లి, సింహచలం, విశాఖపట్నం, ద్వారక, తిరుమల, భద్రాచలం, పండరీపూర్, తుల్జాపూర్, కోలహాపూర్, గోవా వంటి ప్రాంతాలకు యాత్రలు నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రయాణికులు కోరిన చోటికి యాత్రా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.












