కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు కుంట సిద్ధిరాములు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం, సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై, స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.
ఈ వేడుకలకు మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఏ.వి. రమణ రెడ్డి, నాగేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులకు, కాలనీ వాసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.










