నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తారకరామానగర్లో గల శ్రీ రామాలయంలో శుక్రవారం శ్రీ రామ నవమి సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్, బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రుల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మరియు తారకరామానగర్ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.
శ్రీ రామచంద్రుడి కృపతో రాబోయే రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రామరాజ్యం రావాలని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని శ్రీరాముడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఈ పూజల్లో మాజీ సర్పంచ్ బి. రమణారావు, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు, ఆలయ చైర్మన్ ధనంజయ్ రెడ్డి, గౌరవ సభ్యులు సాంభి రెడ్డి, రవి కుమార్, నారాయణ, చిన్న కొండారెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు.












