దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు

Alt Name: సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ నిప్పు
  • ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల
  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో అపశృతి
  • ఎన్టీఆర్ కటౌట్ తగలబడింది
  • టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందంటూ సమాచారం

Alt Name: సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ నిప్పు


సెప్టెంబర్ 27న,

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం థియేటర్లలో విడుదలైన సమయంలో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పు అంటుకుంది. ఈ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, టపాసుల వల్ల ప్రమాదవశాత్తు కటౌట్ తగలబడిందని తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

 

 

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. రాత్రి 1:00 గంట నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలను వేశారు, తెల్లవారుజామున 4:00 గంటలకు షోలు ప్రారంభమయ్యాయి. సినిమా తొలి ప్రదర్శన నుండే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది.

కానీ, ఈ సినిమాకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అపశృతి చోటుచేసుకుంది. థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పు అంటుకుంది. ఈ ఘటనతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఎన్టీఆర్ కటౌట్ తగలబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొంతమంది ఆకతాయిలు ఈ కటౌట్‌ను కావాలనే తగలబెట్టారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కటౌట్‌కి నిప్పు అంటుకుందని సమాచారం. ఈ ఘటనపై ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment