నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహ ధ్వంసం – దుండగుల అరాచకం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ధ్వంసమైన దుర్గాదేవి విగ్రహం
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, విగ్రహాన్ని విరిగించారు
  • కేసు నమోదు చేసిన బేగం బజార్ పోలీసులు

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దుర్గాదేవి విగ్రహం చెయ్యి విరగ గొట్టి, మండపాన్ని చిందరవందర చేశారు. ఈ సంఘటనపై మండపం నిర్వాహకులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతిష్ఠించబడిన దుర్గాదేవి విగ్రహంపై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ప్రతీ ఏడాది పండగల సమయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే నవరాత్రులు పురస్కరించుకుని పూజలు జరుగుతుండగానే గుర్తు తెలియని వ్యక్తులు దుర్గాదేవి విగ్రహం చెయ్యిని విరగ గొట్టి, మండపంలో ద్వీపాలను ఆర్పేసి, చిందరవందర చేశారు. ఈ ఘటనపై మండపం నిర్వాహకులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

Join WhatsApp

Join Now

Leave a Comment