M4 న్యూస్, బాసర,
తెలంగాణ బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ క్షేత్రంలో “శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ” ఆధ్వర్యంలో నృత్య కళార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 160 మంది విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య కళారూపాలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఆలయ పరిపాలన అధికారి విజయ రామారావు సారథ్యంలో, వేద మంత్రాల మధ్య జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఫౌండేషన్ చైర్మన్ నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి నృత్య ఆరాధన చేయడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులకు “నృత్య జ్ఞాన జ్యోతి” పురస్కారం ప్రదానం చేశారు.