సైబర్ వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలి: సీపీ
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, సైబర్ వారియర్స్ కు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, సైబర్ వారియర్స్ కు టీ షర్ట్ లను అందజేసి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో, ప్రజలకు సైబర్ క్రైమ్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు