రాజమండ్రి ఫారెస్ట్ సిబ్బంది అసమర్ధత పై విమర్శలు
మేడా శ్రీనివాస్
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
రాజమండ్రి: రాజమండ్రి అటవీ సిబ్బంది మరియు అధికారులు “పులి” ని కనిపెట్టడంలో తమ అసమర్ధతను బాహాటంగా ప్రకటించారు. జంతు వేటగాళ్లకు పులిని పట్టించే బాధ్యతలు అప్పగిస్తే, ఇప్పటికి పులి జాడ తెలిసేది కదా అని మేడా శ్రీనివాస్
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపించారు.
ప్రజలు చూస్తున్న రాజమండ్రి అటవీ సిబ్బంది ప్రకటనలతోపాటు, వారు చౌకైన పరిష్కారాలను ఇస్తూ, పులిని పట్టుకోవడం కంటే ఎక్కువగా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ ప్రతిష్టను కాపాడేందుకు, అటవీ అధికారులు శిక్షణకు పంపించి నిష్టాతులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
పులి జాడ అన్వేషణ పేరుతో లక్షల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలన, ప్రజలకు దురదృష్టాన్ని ఎదుర్కొనిపిస్తోంది.