- హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ విమర్శ
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
- కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. “రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని సీఎం” అంటూ వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్, “పార్టీ మారినవారు దమ్ముంటే రాజీనామా చేయాలి” అని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై తీవ్ర విమర్శలు చేశారు. “పదేళ్ల పాలనలో ఇలాంటి దాడులు జరగలేదు, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి,” అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హైదరాబాద్‌లో శాంతి కాపాడటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ, “పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలి,” అని వ్యాఖ్యానించారు. “బీఆర్‌ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులు జరుగుతున్నాయి,” అని ఆయన అన్నారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. “ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నార” అని సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.
హైదరాబాద్ ప్రజలు గతంలో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి తమపై కక్షతో వుంటున్నారని ఆయన అన్నారు.