యడ్లపాడు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
యడ్లపాడు మండలం బోయపాలెంలోని సుప్రియ స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్‌లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు గంగా బెహరా (36) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై డ్యూటీకి వెళ్లకుండా గదిలోనే ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యడ్లపాడు మండలం బోయపాలెంలోని సుప్రియ స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్‌లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు గంగా బెహరా (36) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఇతను, మద్యానికి బానిసై నిన్న డ్యూటీకి వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు.
వివరాలు
పిల్లలు సమీపంలోని తెలిసిన వారి క్వార్టర్లో ఉండగా, రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో గంగా బెహరా ఉరివేసుకున్నాడు. ఈరోజు ఉదయం డ్యూటీకి పిలిచేందుకు టైం కీపర్ వెళ్లి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












