రాయిబరేలి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలిలో ఒక యువతి పెట్టిన తప్పుడు అత్యాచారం కేసులో నిర్దోషిగా తేలిన యువకుడికి న్యాయం జరిగింది. అయితే, ఆ యువతికి కూడా అదే శిక్ష పడింది. దాదాపు నాలుగేళ్లన్నర పాటు జైలు జీవితం గడిపిన యువకుడికి ఊరట లభించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలిలో ఒక విచిత్రమైన తీర్పు వెలువడింది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక యువతి, ఒక యువకుడిపై అత్యాచారం జరిగిందంటూ కేసు పెట్టింది. ఈ కేసు కోర్టుకు వెళ్లింది. యువకుడికి శిక్ష పడింది. దాంతో అతను 4 సంవత్సరాల 6 నెలలకుపైగా జైల్లోనే ఉన్నాడు.
యువతి పిటిషన్
అయితే, మధ్యలో ఏమైందో ఏమో ఆ యువతి కోర్టులో మరో పిటిషన్ వేసింది. నాపై అత్యాచారం జరగలేదు.. నేను అతనిపై తప్పుడు కేసు పెట్టాను.. అని అందులో పేర్కొంది.
కోర్టు తీర్పు
కోర్టు ఆ విషయాన్ని పరిశీలించి యువకుడిని విడుదల చేసింది. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తప్పుడు కేసు పెట్టి, తప్పుడు సాక్ష్యం చెప్పిన యువతికి, ఆ యువకుడు ఎంతకాలం జైల్లో ఉన్నాడో అంతకాలం జైలు శిక్ష విధించింది. అంటే 1,653 రోజుల జైలు శిక్ష.
జరిమానా కూడా
అంతేకాదు, 5,88,822 జరిమానా కూడా విధించింది. ఆ జరిమానా కట్టకపోతే మరో 6 నెలలు జైలు శిక్ష అని తీర్పు చెప్పింది.
ఆలోచించాల్సిన విషయం
తప్పుడు కేసులు పెట్టాలనుకునేవారు ఈ తీర్పును ఆలోచించుకోవాలి.












