బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
సోనాల మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్లను ధ్వంసం చేసి, సీసీ కెమెరాలను పగలగొట్టి సుమారు రూ.1.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సోనాల మండల కేంద్రంలోని వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటనలో వైన్ షాప్ నుండి సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువైన మద్యం చోరీకి గురైనట్లు తెలిసింది.
దొంగలు వైన్ షాపుకు చెందిన రెండు షట్టర్లను ధ్వంసం చేసి, షాపుకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను కూడా పగలగొట్టి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు.
దొంగతనం జరిగిన విషయాన్ని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించడంతో, ఉదయం ఎస్సై పురుషోత్తం సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం జాగిలాలతో కలిసి ఆధారాల కోసం గాలించింది.












