ఆరు వరుస హత్యల ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పోక్సో కేసులో నిందితుడిగా నమోదై బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్‌పై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తగిన పర్యవేక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై స్థానిక పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నాయకత్వంలో నగరంలో శాంతి భద్రతలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ప్రజల్లో భరోసా పెరిగిందని ధర్మేంద్ర తెలిపారు. ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్న సీపీ సాయి చైతన్యతో పాటు పోలీసు సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆరు హత్యల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని, సంబంధిత ప్రాంతంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు.











