బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
జన్నారం మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజును బోథ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్టీఐ చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడి అంగన్వాడీ టీచర్ను డబ్బులు డిమాండ్ చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
జన్నారం మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజును బోథ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్టీఐ చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడి అంగన్వాడీ టీచర్ను డబ్బులు డిమాండ్ చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, సొనాల మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజు, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాథోడ్ విమలను గత కొంతకాలంగా ఉద్యోగపరంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా ఆమె వ్యక్తిగత, ఉద్యోగ సంబంధిత వివరాలు సేకరించి, ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది.
అలా చేయకుండా ఉండాలంటే రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేయగా, ఆమె కుమారుడు శ్రీనివాస్ బోథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు రాథోడ్ రాజును అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రజలను బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే నిందితుడి ద్వారా ఎవరైనా ఇబ్బందులకు గురై ఉంటే జిల్లా పోలీసు, యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. బోథ్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












