చందారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన డిగ్రీ పట్టభద్రురాలు తుమ్మ అర్చన (21) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన తుమ్మ అర్చన (21) తన ప్రేమికుడి మృతిని తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న యువతీ యువకుల వివాహానికి ఇరు కుటుంబాలు తొలుత అంగీకరించినప్పటికీ, అనంతరం విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు గత నెల పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న అర్చన శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












