నిర్మల్, జులై 24
దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సంచరించారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయడంతో నిర్మల్ పోలీసులు వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు భరోసా కల్పించారు.
దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేసిన సమాచారంపై నిర్మల్ పోలీసులు వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బన్సపల్లి గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం ఎలాంటి దొంగతనం లేదా నేర ఘటన జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. అలాగే గ్రామంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












